జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

జ్ఞానేష్ కుమార్ ఫారం 6ను చట్టవిరుద్ధంగా, ఒక్కరే మార్చారని ఇప్పుడు క్లారిటీ వచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన పదవిని దుర్వినియోగం చేసి, బీజేపీకి సాయం చేశారని చెప్పడానికి ఇది మరో రుజువు అని ఎక్స్ అకౌంట్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై జరిగిన ఈ దాడిలో పాల్గొన్న జ్ఞానేష్ కుమార్ సహా అందరూ జవాబుదారీగా ఉంటారని రాహుల్ హెచ్చరించారు.

