← Back to news

డాక్టర్ నంబర్ కోసం వెతికితే.. డబ్బు మాయం

By DK· 2 Aug 2026· హైదరాబాద్
డాక్టర్ నంబర్ కోసం వెతికితే.. డబ్బు మాయం

TG: హైదరాబాద్‌లోని నాగోల్ వాణీనగర్‌కు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి శెట్టి వేణుగోపాల్ కిమ్స్ ఆస్పత్రి డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో ఫోన్ నంబర్ వెతికారు. నకిలీ నంబర్‌కు కాల్ చేయగా, సైబర్ మోసగాళ్లు రూ.5 చెల్లించాలని చెప్పి వాట్సాప్‌లో APK ఫైల్ పంపించారు. దానిని ఇన్‌స్టాల్ చేయగానే మొబైల్ స్తంభించిపోయి, బ్యాంకు ఖాతా నుంచి రూ.1.96 లక్షలు కాజేశారు. బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 9h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.