సారీ.. తప్పయిపోయింది !!
'స్టాండప్ కామెడీ పేరుతో సెలబ్రిటీల పెళ్లిళ్లపై వెకిలితనంగా మాట్లాడిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కాళ్ల బేరానికి వచ్చాడు. ఎవరినీ నొప్పించడానికి తాను అలా చేయలేదని, తన కామెంట్ల వల్ల ఎవరైనా బాధపడితే అందుకు తననుమన్నించాలని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. క్షమించాలి.. ఇక ముందు అలా చేయను. అంటూ వీడియో విడుదల చేశాడు. నటి నీహారిక , ఆమె బాబాయ్ పవన్ కల్యాణ్ ,నరేష్ ల పెళ్లిళ్లపై అనుదీప్ స్టాండప్ కామెడీ పేరుతో అపహాస్యం చేశాడు.



