← Back to news

Satellite City..ఏంటి దీని స్పెషాలిటీ?

By Prashanth· 8 Sept 2026
Satellite City..ఏంటి దీని స్పెషాలిటీ?

ప్రధాన నగరంపై జనాభా, ట్రాఫిక్, నివాసం, ఉద్యోగాల ఒత్తిడి తగ్గించేందుకు దగర్లో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే ప్రత్యేక నగరాన్నే ‘Satellite City’ అంటారు. ఇక్కడ ఇళ్లతోపాటు ఆఫీసులు, కంపెనీలు, విద్యాసంస్థలు, హాస్పిటళ్లు, రోడ్లు, ఇతర సదుపాయాలు ఉంటాయి. ప్రధాన నగరానికి అనుబంధంగా ఉన్నప్పటికీ అన్ని సౌకర్యాలతో స్వతంత్రంగా అభివృద్ధి చెందడం దీని స్పెషాలిటీ. ఢిల్లీకి నోయిడా, గురుగ్రామ్, ముంబయికి నవీ ముంబై, పూణెకు పింప్రి-చించ్వాడ్, అహ్మదాబాద్‌కు గాంధీనగర్ వంటి నగరాలను ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు.

More in Infotainment