ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

TG: హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో అర్హతలు లేని కొందరు వ్యక్తులు RMPల పేరుతో వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సరైన వైద్యపరీక్షలు చేయకుండానే అధిక మోతాదులో మందులు సూచిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటి నొప్పితో వచ్చిన ఓ వ్యక్తికి నిమెసులైడ్, డైక్లోఫెనాక్ సోడియం వంటి పెయిన్‌కిల్లర్లతో పాటు సెట్రిజిన్‌ను అధిక మోతాదులో తీసుకోవాలని సూచించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరు ఉపయోగించిన సూదులను తిరిగి వినియోగిస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.



