ఫోక్స్‌వ్యాగన్‌లో లక్ష ఉద్యోగాలకు కోత.. భారీ Restructuring

జర్మన్ ఆటో దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ ప్రపంచవ్యాప్తంగా భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ఇప్పటికే కొనసాగుతున్న 50 వేల ఉద్యోగాల కోతకు అదనంగా మరో 50 వేల పోస్టులను తగ్గించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. మొత్తం సుమారు లక్ష ఉద్యోగాలపై ఎఫెక్ట్ పడనుంది. కంపెనీ ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ఈవీలు, సాఫ్ట్‌వేర్ వంటి కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులకు సిద్ధమవుతోంది. చైనీస్ ఆటో కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ, అధిక ఖర్చులు కూడా ఈ నిర్ణయానికి కారణాలయ్యాయి.



