పాకిస్థాన్‌లో ఆలయం కూల్చివేతను అడ్డుకున్న స్థానికులు

పాకిస్థాన్‌లో 200 సంవత్సరాల నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేసే ప్రయత్నాన్ని స్థానిక అధికారులు అడ్డుకున్నారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరం రహీమ్ బజార్‌లో ఉన్న రామ్ లీలా ఆలయం పురాతత్వ శాఖ గుర్తించిన సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలలో ఒకటి. దాన్ని కూల్చేసి ప్లాజాగా మార్చడానికి ₹2.5 కోట్ల ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. హిందూ సమాజం ప్రతినిధులు కూల్చివేతను అడ్డుకున్నారు. నిరసనలు పెరగడంతో అసిస్టెంట్ కమిషనర్ ఆలయాన్ని సీల్ చేశారు.



