మక్కాలో బంగ్లాదేశీ జంటకు ఉరి.. అసలేం జరిగింది?

సౌదీ అరేబియాలోని మక్కాలో అనైతిక చర్యకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరు బంగ్లాదేశీ పౌరులకు ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది. ఈ నెల 14న నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బషీర్, సితి అక్తర్‌లను ఉరితీసినట్లు సౌదీ హోం మినిస్ట్రీ తెలిపింది. తజిర్ చట్టం ప్రకారం కోర్టు వారికి మరణశిక్ష విధించింది. అయితే, వారు చేసిన తప్పేంటో అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. తమ పౌరులను ఉరితీసిన విషయాన్ని సౌదీ ప్రభుత్వం ముందుగా తెలియజేయలేదని బంగ్లాదేశ్ సీరియస్ అయ్యింది.



