స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని NSF పిలుపు

ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు పాల్గొనకూడదని నాగాలాండ్ రాష్ట్రంలోని నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్(NSF) అన్ని పాఠశాలలు, కళాశాలలకు సూచనలిచ్చింది. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ‘నాగా ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం, జాతీయ జెండా, జాతీయ గీతానికి వ్యతిరేకం కాదని’ తెలిపింది. పూర్తి వెర్షన్ వందేమాతరం(ఆరు స్టాంజాలు)ను బలవంతంగా పాడించడం మాత్రం అంగీకరించమని తెలిపింది. ఇది మతపరమైన భక్తితో ఉండటం వల్ల క్రైస్తవ మెజారిటీ నాగా సమాజానికి ఇది విరుద్ధమని అంటున్నారు.



