హుస్నాబాద్‌లో RTC యూనియన్ ఎన్నికలు.. ఉత్కంఠ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ RTC డిపోలో పదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న యూనియన్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. డిపో పరిధిలో మొత్తం 208 మంది ఓటర్లు ఉండగా, రెండు కూటముల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచే కార్మికులు డిపో వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో డిపో పరిసరాల్లో సందడి నెలకొంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది.


