ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే
పేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ కోండ్రు మురళి మోహన్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇస్తామన్నారు.



