అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు హంపి విజ్ఞప్తి

అమరావతిలో చెస్ అకాడమీ ఏర్పాటుకు సహకరించాలని ప్రముఖ చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి మంత్రి నారా లోకేష్‌ను కోరారు. ఇవాళ ఉండవల్లిలోని నివాసంలో తండ్రి అశోక్‌తో కలిసి మంత్రిని కలిశారు. చెస్ ఒలింపియాడ్ -2026లో మహిళల జట్టు కాంస్య పతకం సాధించడంతో పాటు, వ్యక్తిగత విభాగంలో హంపి కాంస్యం గెలవడంపై లోకేష్ అభినందించారు. అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.


