దొంగే షాప్ ఓనర్‌పై $10 మిలియన్ కేసా? 😳

అమెరికాలోని ఒరెగాన్‌లో 2023లో ఓ గ్రానైట్ షాప్‌లోకి దొంగతనానికి వెళ్లిన కెన్నెత్ వోయిల్స్‌ను షాప్ యజమాని కాల్చాడు. ఈ ఘటనలో వోయిల్స్‌కు మూడు గాయాలయ్యాయి. కానీ ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలైంది. తనను కాల్చిన షాప్ యజమానిపైనే వోయిల్స్ $10 మిలియన్ నష్టపరిహారం కోరుతూ కేసు వేశాడు. కోర్టులో అతను చేసిన వాదనలతో ఈ విషయం బయటకు వచ్చింది. దొంగతనానికి వెళ్లిన వ్యక్తే.. ఇప్పుడు తనకే న్యాయం చేయాలంటూ కోర్టుకెక్కడమే ఈ కేసును ఆసక్తికరంగా మార్చింది. దీనిపై కోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు.



