← Back to news

ఆంధ్ర ముద్దుబిడ్డ అనంత్ అంబానీ: CM చంద్రబాబు

By Mahesh· 2 Oct 2026· AP
ఆంధ్ర ముద్దుబిడ్డ అనంత్ అంబానీ: CM చంద్రబాబు

AP: మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) శంకుస్థాపన కార్యక్రమంలో CM చంద్రబాబు నాయుడు, అనంత్ అంబానీని ‘ఆంధ్ర ముద్దుబిడ్డ’ పేర్కొన్నారు. ఇండస్ట్రియలిస్ట్‌గా మాత్రమే కాకుండా ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్‌లోనూ అనంత్ కీలకంగా పనిచేస్తున్నారని అన్నారు. జామ్‌నగర్‌లో 3,500 ఎకరాల్లో వంతారా ఏర్పాటు, తిరుమల కోసం ఫ్రీ ఎలక్ట్రిక్ బస్సులు అందించడం వంటి అంశాలను గుర్తుచేశారు. రాయలసీమలో ISAను వంతారా మోడల్‌లో డెవలప్ చేయాలని కోరారు.

More in AP