← Back to news

కాంగ్రెస్‌లో వర్గపోరు.. కర్రలు, రాళ్లతో దాడి

By DK· 8 Jul 2026· సూర్యాపేట జిల్లా

TG: సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వివాదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అర్వపల్లిలో భువనగిరి MP చామల కిరణ్‌కుమార్ రెడ్డి, తుంగతుర్తి MLA మందుల సామేల్ వర్గాల నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్ష ఎన్నికలను ఎమ్మెల్యే సామేల్ ఏకపక్షంగా చేపట్టారని ఎంపీ చామల వర్గానికి చెందిన నాయకులు ఆరోపించారు. ఆ ఎన్నికలను రద్దు చేయాలని గాంధీభవన్‌కు బయల్దేరారు. అర్వపల్లిలో వారిని ఎమ్మెల్యే సామేల్ అనుచరులు అడ్డుకున్నారు. ఇరువర్గాల వారు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

More in Politics