అమెరికా ఇరాన్ మధ్య చర్చలు ? ఈ సారి జెనీవాలో

అమెరికా మరియు ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య గురువారం ఇస్లామాబాద్ లేదా జెనీవాలో చర్చలు జరిగే అవకాశం ఉందని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు రాస్తోంది. అప్పటికి అమెరికా విధించిన కాల్పుల విరమణ గడువు కూడా ముగుస్తుంది. అందుకే ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభనని తొలగించడానికి తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అణు ఒప్పందం, ప్రాంతీయ భద్రతపై నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యం. మరోవైపు ఇరాన్ తో చర్చల అంశం పూర్తిగా ఆ దేశం చేతుల్లో ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కామెంట్ చేశారు. Ball is in their court అని అన్నారు.
