← Back to news

కొడంగల్‌ ప్రాజెక్టుపై రేవంత్ కీలక ఆదేశాలు

By DK· 1h ago
కొడంగల్‌ ప్రాజెక్టుపై రేవంత్ కీలక ఆదేశాలు

TG: కొడంగల్ నియోజకవర్గానికి తాగు, సాగునీరు అందించే నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరు, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన CM.. హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకు రూ.1,053 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ఫేజ్-2 టెండర్లు త్వరగా పిలవాలని, భూత్పూర్ జలాశయం సామర్థ్యం పెంపుపై నివేదిక ఇవ్వాలని సూచించారు.

More in TG