పదవి పోయినా పార్టీని వీడను: చిన్నారెడ్డి

TG: రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వారిలో నేనే మొదటి వ్యక్తిని అని కాంగ్రెస్ సీనియర్ నేత జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం జయన్న తిరుమలాపురంలో ఆయన మాట్లాడారు. పదవి కోల్పోయినా కాంగ్రెస్‌తో తన అనుబంధం కొనసాగుతుందని స్పష్టంచేశారు. పార్టీకి 48 ఏళ్లుగా సేవలందించానని, వచ్చే ఎన్నికల్లో అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానన్నారు. గతంలో తనకు ఎమ్మెల్యే టికెట్, రాజ్యసభ అవకాశం, మంత్రి పదవి దక్కకపోయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేశానన్నారు.



