← Back to news

విద్యా వ్యవస్థ మార్చాల్సిందే: నేహా బోరా

By DK· 20 Aug 2026· విజయవాడ
విద్యా వ్యవస్థ మార్చాల్సిందే: నేహా బోరా

AP: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని AISA జాతీయ అధ్యక్షురాలు, జెన్ జీ ఉద్యమ నేత నేహా బోరా అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో ఆమె మాట్లాడారు. దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దు వ్యవహారాల్లో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఢిల్లీలో నిరాహార దీక్ష సందర్భంగా తమను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 7h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.