దేవేంద్ర మహతో..జార్ఖండ్ నిరసనల్లో కీ రోల్ ఆయనదే!

జార్ఖండ్ విద్యార్థుల నిరసనలో దేవేంద్ర మహతోది కీ రోల్. 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ఆయన నీరసంతోనే ఇవాళ జరిగిన ‘విధాన్‌సభ ఘేరావ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 33 ఏళ్ల వయసున్న ఆయన రాంచీ జిల్లా రాహే బ్లాక్ కాపీడీహ్ గ్రామానికి చెందినవారు. డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ యూనివర్సిటీ నుంచి సంస్కృతం, కుర్మాలీ, ట్రైబల్ లాంగ్వేజెస్‌లో PG చేశారు. 2015 నుంచి విద్యార్థి ఉద్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ స్కాలర్‌షిప్‌లు, పేపర్ లీక్‌లు, రిజర్వేషన్ సమస్యలపై పోరాడుతున్నారు.



