← Back to news

రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ: పవన్‌ కల్యాణ్‌

By డీకే· 19 Jun 2026· Andhrajyothy· అమరావతి
రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ: పవన్‌ కల్యాణ్‌

AP: ‘రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ CM పవన్‌ కల్యాణ్‌ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ‘గ్రీనింగ్‌ సొసైటీ’ ఏర్పాటు చేయాలని, జూలై 3వ తేదీ నాటికి సొసైటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఒకే పంచాయతీలో సాధ్యం కాకపోతే.. 3-4 పంచాయతీలను క్లస్టర్‌గా చేసి, ఉమ్మడిగా ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని సూచించారు.

More in AP