← Back to news

ప్రిన్సిపాల్ అవమానించిందని..దళిత అమ్మాయి ఆత్మహత్య

By Vishi· 5d ago· Indiatimes
ప్రిన్సిపాల్ అవమానించిందని..దళిత అమ్మాయి ఆత్మహత్య

ప్రిన్సిపాల్ అవమానించిందని తమిళనాడు రాష్ట్రం మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన దళిత అమ్మాయి(16) ఆత్మహత్య చేసుకుంది. నర్సింగ్ చదవాలనుకున్న ఆ అమ్మాయి అడ్మిషన్ కోసం ప్రభుత్వ మోడల్ సెకండరీ స్కూల్‌కి తన తల్లితో కలిసి వచ్చింది. ఇంటర్వ్యూ టైంలో తన తల్లి చేతులు ముడుచుకుని నిలబడి ఉండటం చూసి, చేతులు సరిచేసుకోమని అమ్మాయి తల్లికి సైగ చేసింది. ప్రిన్సిపల్ కోపం తెచ్చుకుని, ఆ అమ్మాయిపై కుల వివక్ష కామెంట్స్ చేసింది. మనస్తాపం చెందిన అమ్మాయి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ప్రిన్సిపల్‌పై కేసు రిజిస్టర్ చేశారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 3h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.