నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు

చైనా, నేపాల్ సరిహద్దు ప్రాంతం అయిన సిచువాన్ ప్రావిన్స్‌లో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో నేపాల్‌లో వరద బీభత్సం తగ్గకముందే మరో పెను విలయం విరుచుకుపడనుంది. మూడు రోజుల క్రితం వచ్చిన వరద కంటే దాదాపు ఐదు రెట్ల ఎక్కువ తీవ్రతతో మరో డెడ్లీ వరద ముంచుకొస్తోందని స్థానిక అధికారులు, పోలీసులు అత్యవసర ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నదీ పరివాహక ఎగువ ప్రాంతాల నుంచి ఉప్పెనలా దూసుకొస్తున్న ఈ వరద మరో 20 నిమిషాల్లో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తనుందని సమాచారం అందింది. ప్రభావిత ప్రాంతాల్లో Red alert ప్రకటించారు.


