నవోదయలో 9, 11వ తరగతి సీట్లు.. అప్లికేషన్లు షురూ

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ సీతారాంబాబు తెలిపారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసి దరఖాస్తు సమర్పించాలని కోరారు. నిర్ణీత గడువు ముగిసేలోపు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.



