← Back to news

తల్లీకూతుళ్లపై హిందూ రక్షాదళ్‌ దాడి

By Vishi· 5 Aug 2026· Hindustantimes· UP

యూపీలోని ఘజియాబాద్ జిల్లా మోదీనగర్‌లో దీప, ఆమె తల్లి సుమనలపై కొందరు దాడి చేశారు. వారు ఓ ఆవును ఇంటికి తీసుకెళ్తుండగా హిందూ రక్షాదళ్‌కు చెందిన సప్నా అగర్వాల్ తదితరులు వాళ్లని ఆపి, ఆవును దొంగిలించినట్టు అనుమానించి తిట్టి, కొట్టారు. తాము పశువులు పెంచే కుటుంబమని బాధితులు చెప్పినా నమ్మలేదు. పోలీసులు వచ్చి వారిని విడిపించారు. దీప ఫిర్యాదు మేరకు సప్నా అగర్వాల్‌తోపాటు ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆవును గోశాలకు తరలించారు.

More in India