MLA క్యాంపు కార్యాలయంలో దసరా వేడుకలు
సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కుటుంబసమేతంగా ఆయుధ పూజలు, వాహన పూజలు నిర్వహించారు. పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువలు, బొకేలు అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జేజే నగర్‌లోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.


