నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌కు భూమిపూజ

AP: సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు అధికారులు భూమిపూజ చేశారు. కన్స్ట్రక్షన్ ఈఈ శ్రీధర్, హిందూపూర్ డివిజన్ ఆపరేషన్ ఈఈ చంద్రనాయక్, డీఈఈ నాగన్న, గుండుమల సర్పంచ్ చంద్రప్పతో పాటు విద్యుత్ శాఖ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. నూతన సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే గుండుమలతో పాటు పరిసర గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని అధికారులు తెలిపారు. విద్యుత్ అంతరాయాలు తగ్గడంతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా సరఫరా సామర్థ్యం పెరుగుతుందన్నారు.



