డీ-17 కాల్వకు నీరు బంద్.. రైతుల ఆందోళన

TG: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ డీ-17 కాల్వ ద్వారా నీరు అందకపోవడంతో పెద్దాపురం, లక్ష్మాపురం, మామిళ్లపల్లి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. కాల్వలో మట్టి, పెద్ద బండరాళ్లు పేరుకుపోవడంతో నీరు ముందుకు సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కరించలేదని ఆరోపించారు. నీరు అందకపోతే సుమారు 800 ఎకరాల పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల ఆందోళనకు మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొత్త రవీందర్‌రావు సంఘీభావం తెలిపారు.



