ఇది లాఠీచార్జ్ కాదు: రాంచీ డీఎస్పీ
జార్ఖండ్‌లో విద్యార్థుల మీద ఎలాంటి బలప్రయోగం చేయలేదని నగర డీఎస్పీ అజయ్ ఆర్య మీడియాతో చెప్పారు. గుంపును అదుపు చేయడానికి పోలీసులు వాళ్లను వెనక్కి నెట్టాల్సి వచ్చిందని, దీన్ని లాఠీచార్జీ అని చెప్పలేమని అన్నారు. నిరసనకారులపై ఎలాంటి బలప్రయోగం చేయవద్దని పోలీసులకు కఠినమైన సూచనలు ఇచ్చామని తెలిపారు. అయినా కొందరు నిరసనకారులు గాయపడ్డార, ఒకరికి పోలీసు లాఠీతో తలపై దెబ్బ తగిలిందన్నారు.



