← Back to news

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి

By K. PURNA CHANDU.· 54m ago· Palasa, Palasa, Srikakulam
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి

AP: ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని శాంతిభద్రతలను పటిష్ఠం చేసేందుకు పోలీసులు రాంపురం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలోని రాంపురంలో శనివారం రాత్రి కాశీబుగ్గ డీఎస్పీ టి.భవాని, సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్‌ఐ కె.కృష్ణ ప్రసాద్ గ్రామస్థులతో మమేకమయ్యారు. సమస్యలు, భద్రతా అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణం ఉండేలా సహకరించాలని కోరారు. సైబర్ నేరాలు, వివిధ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలి

More in Local