← Back to news

నంది మేడారంలో క్రీడా సందడి.. జోనల్ కు షార్ట్‌లిస్ట్!

By Srikanth· 1d ago· Peddapur, Julapalli, Peddapalli
నంది మేడారంలో క్రీడా సందడి.. జోనల్ కు షార్ట్‌లిస్ట్!

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం సాంఘిక బాలికల గురుకుల పాఠశాలలో గురువారం మండల స్థాయి క్రీడలు ఘనంగా ముగిశాయి. కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, అథ్లెటిక్స్‌లో పోటీలు జరిగాయి. మండల విద్యా వనరుల అధికారి పి. ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను పెద్దపల్లి జోనల్ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా క్రీడల కార్యదర్శి లక్ష్మణ్, సర్పంచ్ వీరపాలు, ప్రిన్సిపాల్ విజయ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.