మానసిక ఒత్తిడికి చెక్: సెన్సరీ బేస్‌లైన్ రీసెట్

రోజంతా ఫోన్ స్క్రీన్ చూడటం, వర్క్ స్ట్రెస్ వల్ల వచ్చే మెంటల్ స్ట్రెస్‌ని తగ్గించడానికి 'సెన్సరీ బేస్‌లైన్ రీసెట్' హెల్ప్ అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అంటే కళ్లు, చెవులకు బయట ప్రపంచం నుంచి విశ్రాంతి , మైండ్‌ను ప్రశాంతంగా ఉంచడం. గట్టి శబ్దాలు, రోజంతా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడటం వల్ల వచ్చే స్ట్రెస్‌ను తగ్గించి, బ్రెయిన్‌ను ప్రశాంతంగా ఉంచుతుంది. రోజుకి 15 నుండి 20 నిమిషాలు ఫోన్, టీవీ దూరంగా పెట్టాలి. తక్కువ లైటింగ్‌లో కళ్లు మూసుకుని సైలెంట్‌గా కూర్చోవడం, పచ్చటి గడ్డిపై నడవడం, లాంగ్ బ్రీత్ తీసుకోవడం చేస్తే మైండ్ రీసెట్ అవుతుంది.



