← Back to news

తిరువూరులో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

By Bharath Joshi· 26 Aug 2026· Ntr జిల్లా
తిరువూరులో ఘనంగా మిలాద్ ఉన్ నబీ వేడుకలు

AP: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో మిలాద్ ఉన్ నబీ పర్వదిన వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని పలు మస్జిద్‌లలో ప్రత్యేక నమాజ్, ప్రార్థనలు చేపట్టారు. జామియా మస్జిద్ మతగురువు రిజ్వీ మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, సౌభ్రాతృత్వం, మానవత్వ విలువలను వివరించారు. ప్రవక్త మహమ్మద్ చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ప్రేమ, సహనం, సోదరభావాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. మిలాద్ ఉన్ నబీ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

More in Local