జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి

AP: విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలంలో 'విశాలాంధ్ర' విలేకరి పి.గోవిందరావుపై చేసిన దాడిని శ్రీకాకుళం జిల్లా మందస మండల జర్నలిస్టులు ఖండించారు. జర్నలిస్టులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని మండల అధ్యక్షులు వి.వి.రమణమూర్తి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరుతూ తహశీల్దార్ బలివాడ శ్రీహరికి వినతిపత్రం ఇచ్చారు. జర్నలిస్టులపై దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను కోరారు.



