← Back to news

'ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి'

By VGRAO· 1d ago· Karimnagar
'ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి'

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంతో పాటు నగునూరులోని దుర్గాభవాని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కలిసి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రార్థించారు.

More in Local