← Back to news

దళితుల మరణాలపై న్యాయ విచారణ జరపాలి: శ్రీనివాసరావు

By DK· 58m ago
దళితుల మరణాలపై న్యాయ విచారణ జరపాలి: శ్రీనివాసరావు

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో 15 రోజుల్లో ఇద్దరు దళితులు మృతి చెందిన ఘటనలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతల వైఖరి, పోలీసుల వేధింపుల వల్లే ఈ మరణాలు జరిగాయని ఆరోపించారు. బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించకపోవడం సరికాదన్నారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

More in Local