← Back to news

జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీ

By K. RAJASHEKAR KMR· 21 Aug 2026· Sadashiva Nagar, Sadashivanagar, Kamareddy
జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీ

TG: జాతీయ రహదారిపై రెండు భారీ వాహనాలు ఢీకొనడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కల్వరాల శివారులో 42వ జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ముందు చక్రం విరిగి రోడ్డుపై ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం లారీని ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు భారీ క్రేన్‌ను తీసుకువచ్చి వాహనాలను రహదారి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు.

More in Local