← Back to news

దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చిన గ్రామస్తులు

By DK· 1h ago
దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చిన గ్రామస్తులు

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు అమలు చేయడంలో విఫలమైందంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామస్తులు వినూత్న నిరసన చేపట్టారు. “ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.. ఆయనకు చెప్పినా, దున్నపోతుకు చెప్పినా ఒక్కటే” అంటూ గ్రామంలోని దున్నపోతుకు వినతిపత్రం అందజేశారు. మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

More in Local