రాఖీ పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ

TG: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ రాఖీ పౌర్ణమి సందర్భంగా తన అక్కాచెల్లెళ్లతో ఆత్మీయంగా పండుగ వేడుకలు జరుపుకున్నారు. సోదరీమణులు ప్రేమపూర్వకంగా రాఖీలు కట్టగా ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆనందంగా స్వీకరించి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్ల అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు జీవితాంతం ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య బంధాన్ని మరింత బలపరిచే పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు.

