← Back to news

నోయిడాలో మురికి నీరు.. 350 కుటుంబాల ఇబ్బందులు

By Lokesh· 1h ago· X

నోయిడాలోని సెక్టార్-94లో సూపర్‌టెక్ సూపర్‌నోవా అపార్ట్‌మెంట్‌లో 350కిపైగా కుటుంబాలు మురికినీటితో ఇబ్బందులు పడుతున్నాయి. బిల్డర్ బాకీ కారణంగా రెండేళ్లుగా గంగా నీటి సరఫరా నిలిచిపోయినట్లు అక్కడున్నవాళ్లు చెబుతున్నారు. ట్యాప్‌లు, ఫ్లష్‌ల నుంచి పసుపు, నలుపు రంగులో దుర్వాసన నీరు వస్తోందని వాపోతున్నారు. నీటిలో పురుగులు కనిపిస్తున్నాయని, దీని వల్ల చర్మ సమస్యలు, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచి నీటి కోసం ప్యాకేజ్డ్ వాటర్ కొనాల్సి వస్తోందని చెబుతున్నారు.

More in National