CM విజయ్‌కు డీఎంకే మద్దతు

కేంద్ర ప్రభుత్వం చేయాలని చూస్తున్న డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా టీవీకే ప్రభుత్వం తీసుకున్న తీర్మానానికి తమిళనాడు అసెంబ్లీ సమావేశంలో డీఎంకే మద్దతు తెలిపింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ ‘డీలిమిటేషన్ పేరుతో పార్లమెంటు సభ్యుల సంఖ్య తగ్గకూడదు. వచ్చే 25 ఏళ్లపాటు డీలిమిటేషన్ చేయకూడదనేదే మా స్టాండ్’ అని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీర్మానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తమిళనాడుకు డీలిమిటేషన్ వల్ల నష్టం జరగకూడదని నిర్ణయించినట్టు తెలిపారు.



