“అమ్మ కావాలని ఉంది”.. PCOS భయాలపై శ్రుతి హాసన్ ఓపెన్!

‘ముమెట్స్’ పోడ్‌కాస్ట్‌లో నటి శ్రుతిహాసన్ మాతృత్వంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 14 ఏళ్ల వయసు నుంచే తనకు PCOS ఉందని, పిల్లలు పుట్టడం కష్టమవుతుందని చెప్పడంతో తల్లిని కావడం గురించి భయపడ్డానన్నారు. గైనకాలజిస్ట్ డాక్టర్ ధ్రుప్తి దేధియా తన ఆలోచనను మార్చారని చెప్పారు. ఎగ్ ఫ్రీజింగ్ గురించి తెలుసుకున్నానన్నారు. భవిష్యత్తులో బయోలాజికల్ బిడ్డను కనాలని, అవసరమైతే దత్తత తీసుకోవాలని భావిస్తున్నానని తెలిపారు.


