← Back to news

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం

By Sunil· 18 Aug 2026

AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వినుకొండ రోడ్డులోని 'NSB కార్ డెకార్స్‌'లో వెల్డింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కారుకు మంటలు అంటుకున్నాయి. పక్కనే ఉన్న ఫార్చ్యునర్ కార్లు కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు అంటున్నారు. పక్కనే ఉన్న బిరియాని రెస్టారెంట్‌కి సైతం మంటలు వ్యాపించాయి.

More in Local