పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని ధర్నా

AP: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో గురువారం చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిర్వాసితులతో కలిసి చేపట్టిన ఈ ఆందోళనలో ముంపు ప్రాంతంలోని అన్ని గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ముంపునకు గురవుతున్న వ్యవసాయ భూములకు మెరుగైన ప్యాకేజీ అందించాలని కోరారు. నిర్వాసితులను ఖాళీ చేయించే సమయాన్నే కటాఫ్ తేదీగా ప్రకటించి 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పరిహారం ఇవ్వాలన్నారు.




