← Back to news

అంబేద్కర్ కాలనీ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

By Abhishek· 50m ago· Rudrur, Rudrur, Nizamabad
అంబేద్కర్ కాలనీ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ MPPS పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ సందడి చేశారు. TG సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగతో కాలనీలో సందడి నెలకొంది. మహిళల ఐక్యతను చాటే బతుకమ్మను అందరూ ఆనందంగా జరుపుకోవాలని పలువురు పేర్కొన్నారు.

అంబేద్కర్ కాలనీ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు
అంబేద్కర్ కాలనీ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

More in Local