CMను ప్రశ్నించిన జర్నలిస్ట్‌కు బెదిరింపులు

లక్నోలో ఈనెల 11న జరిగిన ఓ మీడియా కార్యక్రమంలో జర్నలిస్ట్ దివ్య శ్రీవాస్తవ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. సీఎం ప్రసంగం తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోతుండగా, ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కోరిన వీడియో SMలో వైరల్ అయింది. ఆ తర్వాత తనకు ఆన్‌లైన్‌లో తిట్లు, బెదిరింపులు వచ్చినట్లు దివ్య ఆరోపించారు. తనను రాజకీయ పార్టీలకు అనుకూలంగా పనిచేసే జర్నలిస్టుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు


