NRI ఇంట్లో చోరీకి వెళ్లి.. దొంగకు షాక్!
గుజరాత్‌లోని సూరత్ రాజారాంనగర్ సొసైటీలో NRI ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఇనుప గ్రిల్స్‌లో ఇరుక్కున్నాడు. ఇంట్లోకి చొరబడి పారిపోబోయే సమయంలో వెనుకవైపు గ్రిల్‌లో ఇరుక్కుపోయాడు. అటూ ఇటూ కదలలేక నానా తంటాలు పడ్డాడు. స్థానికులు గమనించి కర్రలు, రాళ్లతో చితకబాదారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంటి యజమాని ఎలాంటి సామాన్లు చోరీ కాలేదని స్పష్టం చేశారు.



