బాక్సర్ 'మేరీ కోమ్' BIGG BOSS లోకి

బాక్సింగ్ లో ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన మేరీ కోమ్ హిందీ ‘బిగ్‌బాస్ 20’ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన తర్వాత మరో మేరీ కోమ్ రావడం కష్టమని చెప్పారు. ఇప్పటి యంగ్ బాక్సర్లలో డిసిప్లిన్, కన్సిస్టెన్సీ తగ్గాయని అన్నారు. ఒకట్రెండు గెలుపులకే పేరు, డబ్బు రావడంతో వారిలో గెలవాలనే ఆకలి తగ్గిపోతోందని తెలిపారు. మణిపూర్, అసోం నుంచి వస్తున్న జడుమణి సింగ్, లవ్లినా లాంటి యంగ్ బాక్సర్లను ఆమె మెచ్చుకున్నారు. కొత్త మనుషులను కలవడానికే బిగ్‌బాస్‌కి వెళ్తున్నానని చెప్పారు.



