← Back to news

ఎమ్మెల్యే గారూ.. మాకో బడి కావాలి..!

By Adithya· 2d ago
ఎమ్మెల్యే గారూ.. మాకో బడి కావాలి..!

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన సంచార జాతుల పిల్లలు ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకోవాలని, చదువుకోవాలంటే బడి కావాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ’’బడులు అందుబాటులో లేకపోవడంతో చాలామంది పిల్లలు చదువు మానేశారు. కొంతమంది మాత్రమే దూర ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాల’’ని వారు కోరారు. MLA స్పందించి, ఆ ప్రాంతంలో ఉన్స స్థలంలో పాఠశాల భవనం నిర్మిస్తానని, పిల్లలకు చదువు అందుబాటులోకి తెస్తానని చెప్పారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 8h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.