← Back to news

ఆగి ఉన్న లారీని ఢీకొట్టి వ్యక్తి మృతి

By Srinivas· 1d ago
ఆగి ఉన్న లారీని ఢీకొట్టి వ్యక్తి మృతి

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని జయప్రకాష్ నగర్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. చారకొండ మండలం కమాల్‌పూర్ తండాకు చెందిన చంద్రశేఖర్ (41) బైక్ పై కల్వకుర్తి వైపు వెళ్తుండగా లారీని ఢీకొట్టాడు. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కల్వకుర్తి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.